దేశంలోనే మొదటి ప్రమాణ్ ధ్రువీకరణ దక్కించుకున్న ఏపీఎఫ్డీసీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమరావతి
దేశంలోనే మొట్టమొదటి ప్రమాణ్ ధ్రువీకరణ పత్రం ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థకు దక్కింది. దిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ చేతుల మీదుగా ఏపీఎఫ్డీసీ అధికారులు ఈ ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. రాష్ట్రంలో సత్యవేడు, కావలి, నెల్లూరు, నాయుడుపేటతో పాటు ఉమ్మడి ప్రకాశం, కృష్ణా జిల్లాల పరిధిలో 33 వేల హెక్టార్లలో యూకలిప్టస్ సాగు చేస్తున్నందుకు ఈ గుర్తింపు లభించినట్లు అధికారులు తెలిపారు. అటవీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లతో వాణిజ్య అనుసంధానాన్ని పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం.