తొమ్మిదో తరగతి పాఠ్యాంశాల్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను చేర్చిన ఎన్సీఈఆర్టీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: New Delhi

దేశంలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించే దిశగా ఎన్సీఈఆర్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఎన్సీఈఆర్టీ చీఫ్ దినేష్ ప్రసాద్ సక్లానీ తెలిపారు. తొమ్మిదో తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను లెక్కింపు విధానాన్ని కొత్తగా చేర్చినట్లు ఆయన వెల్లడించారు. పన్నులు నిజాయితీగా, సమయానికి చెల్లించడం ప్రతి పౌరుడి ముఖ్యమైన బాధ్యత అని ఈ పాఠం ద్వారా విద్యార్థులకు బోధిస్తామని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులకు చిన్ననాటి నుంచే వ్యక్తిగత ఆర్థిక నిర్వహణపై స్పష్టత వస్తుందని తెలిపారు.