బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్లలో తెదేపా స్పష్టమైన ఆధిక్యం

రిపోర్టర్: సతీష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తెలుగుదేశం పార్టీ ఘన ఆధిక్యం సాధించిందని అధికారులు తెలిపారు. మొత్తం 163 పోస్టల్ ఓట్లలో తెదేపాకు 90 ఓట్లు దక్కగా, వైకాపాకు 39, బీజేపీ, జనసేన పార్టీలకు చెరో 15 ఓట్లు లభించాయి. రెండు ఓట్లు చెల్లనివిగా మారగా మరో రెండు నోటాకు పడ్డాయి. ఈ ఫలితాలు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.