ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలు: నెతన్యాహు ఓట్ల చోరీ ఆరోపణలను కొట్టిపారేసిన పోలీసులు

రిపోర్టర్: మహేష్ స్థలం: Tel Aviv

ఇజ్రాయెల్ దేశంలో జరిగిన ఎన్నికల్లో ఓట్లు చోరీ అయ్యాయంటూ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పార్టీ చేసిన ఆరోపణలను ఇజ్రాయెల్ పోలీసులు పూర్తిగా తోసిపుచ్చారు. ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని, ఎలాంటి అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని పలువురు పోలీసు అధికారులు స్పష్టం చేసినట్లు మీడియా వెల్లడించింది. అయితే నూతన ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.