ఖైరతాబాద్ ఉపఎన్నిక టికెట్ తనకే వస్తుందంటూ విజయా రెడ్డి ధీమా
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపపోరు నగర రాజకీయాలను వేడెక్కిస్తున్న తరుణంలో దివంగత పీజేఆర్ కూతురు విజయా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పీజేఆర్ పేరు లేనిది కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లదని, దానం నాగేందర్‌ను జాతీయ రాజకీయాలకు పంపి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆమె స్పష్టం చేశారు. ఈసారైనా పీజేఆర్ బిడ్డకు న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని, క్షేత్రస్థాయిలో ఇప్పటికే అనుచరులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు విజయా రెడ్డి తెలిపారు.