హైదరాబాద్లో అండర్గ్రౌండ్ కేబుల్ పనుల్లో వేల కోట్ల భారీ కుంభకోణం

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

హైదరాబాద్ మహానగరంలో అండర్గ్రౌండ్ కేబుల్ పనుల పేరుతో భారీ అక్రమాలకు తెరలేపారని నమస్తే తెలంగాణ కథనం వెల్లడించింది. తొలి విడతలో నాలుగు వేల ఐదు కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించగా, టెండర్ల నాటికి వాటిని ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పెంచారు. ఈ కాకిలెక్కల ద్వారా వెయ్యి కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు పెద్దలు స్కెచ్ వేశారని విద్యుత్తు రంగ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.