స్థానిక ఎన్నికల నిర్వహణపై స్పష్టత: త్వరలో మూడు దశల్లో పంచాయతీ సమరం
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయవాడ
రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన పద్నాలుగు రోజుల్లోనే పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.