జన్వాడ ఫామ్ హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత హైటెన్షన్ వాతావరణం
రిపోర్టర్: శివ
స్థలం: రంగారెడ్డి
జన్వాడలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఫామ్ హౌస్‌ను సందర్శించనున్న నేపథ్యంలో చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు. భూముల రికార్డులు, యాజమాన్య వివరాలను పరిశీలించనున్నట్లు కాంగ్రెస్ బృందం వెల్లడించింది. మరోవైపు ఫామ్ హౌస్ తనదేనని, కేటీఆర్‌కు లీజుకు మాత్రమే ఇచ్చానని కేటీఆర్ మిత్రుడు ప్రదీప్ రెడ్డి స్పష్టం చేయడం గమనార్హం.