స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీలో రిజర్వేషన్లు ఖరారు చేసిన సర్కార్
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ అలాగే మున్సిపల్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు పురపాలక శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు మహిళలకు కేటాయించిన కోటాలను ప్రభుత్వం స్పష్టంచేసింది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.