ఎల్నినో వేళ పోలవరం కాలువలతో రాయలసీమ నుంచి విశాఖకు జలకళ!
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో తీవ్ర ఎల్నినో పరిస్థితుల్లో గోదావరి వరద జలాలు పలు ప్రాంతాలకు ఊరటనిస్తున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు 38 టీఎంసీలకు పైగా తరలించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖ నగరానికి, ఏలేరు ఆయకట్టుకు గోదావరి నీరు చేరుతోంది. ఎండిపోయిన జలాశయాలకు ప్రత్యామ్నాయంగా గోదావరి వరద జలాలను మళ్లించడం ద్వారా తాగు, సాగునీటి ఇబ్బందులు తొలగిపోయాయి.