పులివెందులలో రాజకీయ ఉద్రిక్తత: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పోలీసుల నోటీసులు జారీ

రిపోర్టర్: మహేష్ స్థలం: పులివెందుల

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం పులివెందులలోని ఆయన స్వగృహానికి వెళ్లిన పోలీసులు గోడకు నోటీసులు అంటించారు. ఎన్నికల వేళ ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించరాదని పోలీసులు స్పష్టం చేశారు. ఐదుగురికి మించి గుమిగూడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ పరిణామం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని పోలీసు అధికారులు వెల్లడించారు.