టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను బహిష్కరించిన ఫిల్మ్ ఫెడరేషన్
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు జానీ మాస్టర్ భార్య సుమలత తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయబోమని, ఎలాంటి సహకారం అందించబోమని ఫెడరేషన్ తేల్చిచెప్పింది. ఫెడరేషన్ నిర్ణయాలపై ఆయన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, తన భర్తపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ సుమలత ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.