రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి లభిస్తోందంటూ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Visakhapatnam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగు, వినియోగం విచ్చలవిడిగా సాగుతోందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏదైనా రెఫరెన్స్‌తో వెళ్తే ఏ బడ్డీ కొట్టు వద్దైనా గంజాయి సులభంగా దొరుకుతుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ, ఎన్డీయే కూటమి పాలనలో ఒక్క గ్రీన్ ఫీల్డ్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా రాలేదని మండిపడ్డారు. తాను స్థాపించనున్న కొత్త పార్టీలో యువతకు సగం సీట్లు కేటాయిస్తామని, తాను మాత్రం ముఖ్యమంత్రి రేసులో ఉండబోనని స్పష్టం చేశారు.