ఓటీటీలోకి సుమంత్ మహేంద్రగిరి వారాహి: అక్టోబర్ రెండు నుంచి స్ట్రీమింగ్

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

అభిమాను ఎంతగానో ఎదురుచూస్తున్న సుమంత్ నటించిన మహేంద్రగిరి వారాహి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైందని చిత్ర యూనిట్ వెల్లడించింది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్లో అక్టోబర్ 2 నుంచి తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని చిత్ర నిర్మాతలు స్పష్టం చేశారు.