'జెండా ఎగరేయకుండా అడ్డుకునే ధైర్యం ఉందా?': కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్రమంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ లు నిజాం నిరంకుశ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఓట్ల రాజకీయాల కోసమే సీఎం రేవంత్ రెడ్డి నిజాంను పొగుడుతున్నారని ధ్వజమెత్తారు. సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగరేయకుండా అడ్డుకునే ధైర్యం ఎంఐఎం, కాంగ్రెస్, బిఆర్ఎస్ లకు ఉందా అని ఆయన సవాల్ విసిరారు.