అరుణాచల్ సరిహద్దులో భారత్-చైనా కీలక సైనిక చర్చలు
రిపోర్టర్: శివ
స్థలం: భారత్
అరుణాచల్ ప్రదేశ్ తూర్పు సెక్టార్లో భారత్, చైనా సైన్యాలు తొలిసారిగా కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు నిర్వహించాయి. వాచా మరియు దమై సరిహద్దు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు సానుకూలంగా సాగాయి. ఎల్ఏసీ వెంబడి శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించే దిశగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సానుకూల దిశలో పయనిస్తున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.