అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు, తెగిపోయిన తాత్కాలిక వంతెన
రిపోర్టర్: కిరణ్
స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ చిన్న గంగవరం వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఏపీ-ఒడిశా సరిహద్దులోని 15 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నిత్యావసర సరుకులు, అత్యవసర వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కొత్త బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.