రిమ్స్ ఆసుపత్రి ఎస్‌ఎన్‌సీయూలో అగ్నిప్రమాదం, ఊపిరాడక ఐదు రోజుల పసికందు మృతి

రిపోర్టర్: నరేష్ స్థలం: అదిలాబాద్

అదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రి నవజాత శిశువుల ప్రత్యేక వార్డులో సంభవించిన అగ్నిప్రమాదంలో ఐదు రోజుల పసికందు దుర్మరణం చెందింది. ఏసీ పేలడంతో భారీగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. వార్డు బయటికి వచ్చిన సలీమ్ ఖాన్ అనే తండ్రి, ఆందోళనతో తిరిగి లోపలికి వెళ్లి చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఊపిరాడక అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది.