గణేష్ మండపాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: సజ్జనార్

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

గణేష్ ఉత్సవ మండపాల నిర్వాహకులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా పోలీస్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గణేష్ చతుర్థి వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు, వాలంటీర్లను ఏర్పాటు చేయాలని, సోషల్ మీడియా పుకార్లపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.