పేదల సొంతింటి కల సాకారం: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల దీపావళి వేడుకలు
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
పేదల సొంతింటి కలను సాకారం చేసేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి విడతలో మంజూరైన గృహాల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తామని వారు స్పష్టం చేశారు.