గని ప్రమాదంలో గాయపడిన కార్మికులకు పరామర్శ
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట గనిలో గత నాలుగు రోజుల క్రితం బొగ్గుగనిలో బాంబు మిస్ బ్లాస్ట్ కావడంతో బెల్లంపల్లి నివాసులైన కార్మికులకు గాయాలయ్యాయి. సింగరేణి యాజమాన్యం వారిని సింగరేణి ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స నిర్వహిస్తోంది. గాయపడిన కార్మికులు క్రాంతి కుమార్, రాజ్ కుమార్ లను కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి శుక్రవారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.