మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు

రిపోర్టర్: సతీష్ స్థలం: రష్యా

రష్యా పార్లమెంటరీ ఎన్నికల పోలింగ్ చివరి రోజైన ఆదివారం ఉక్రెయిన్ బలగాలు రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా భారీ డ్రోన్ దాడులతో విరుచుకుపడ్డాయి. మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ వెల్లడించిన వివరాల ప్రకారం, నగర వైపు దూసుకొచ్చిన 450కి పైగా డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. అయినప్పటికీ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ శకలాలు పడటంతో జరిగిన ఈ భీకర దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. ఈ దాడులకు ప్రతీకారంగా రష్యా జరిపిన వైమానిక దాడుల్లో ఉక్రెయిన్‌లో తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో తూర్పు ఐరోపాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.