గోదావరి కావేరి అనుసంధానం చేపట్టాలంటూ ప్రధాని మోదీకి చంద్రబాబు వినతి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: దిల్లీ
దక్షిణాది రాష్ట్రాలను కరవు రహితంగా మార్చేందుకు గోదావరి కావేరి నదుల అనుసంధానానికి తక్షణమే కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దిల్లీలో ప్రధానితో భేటీ అయిన ఆయన, రాష్ట్రానికి సంబంధించిన వివిధ కీలక ప్రాజెక్టులు, ఆర్థిక పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు విశాఖ మెట్రోకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.