ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతలను అధిగమించాలి: నారా లోకేష్

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్ ముగింపు సభలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలవాలంటే పార్టీ, పర్సనల్, ప్రభుత్వం అనే మూడు ‘పీ’లను అందరూ పాటించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల త్యాగాల వల్లే అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని జగన్ అని ఎద్దేవా చేస్తూ, కలిసికట్టుగా రాష్ట్రాన్ని, పార్టీని ముందుకు నడిపిద్దామని స్పష్టం చేశారు.