వాహనదారులకు గుడ్ న్యూస్: ఫ్లెక్స్ ఫ్యూయల్ నిబంధనలపై కేంద్రం కీలక ప్రకటన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: New Delhi
దేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజా నిబంధనలను సవరించినట్లు వెల్లడించింది. అధిక ఇథనాల్ శాతం కలిగిన ఇంధనాలతో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ఉద్గార ప్రమాణాల్లో ఈ-వంద శాతాన్ని కూడా చేర్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నూతన విధానం ద్వారా వాహనదారులకు ఇంధన భారం తగ్గడంతో పాటు విదేశీ చమురు దిగుమతులు గణనీయంగా తగ్గుతాయని కేంద్రం పేర్కొంది.