సర్వజన ఆసుపత్రిలో అధ్వానంగా మరుగుదొడ్లు, రోగుల ఇక్కట్లు
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయనగరం
విజయనగరం మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరవయ్యాయి. ఆసుపత్రిలోని సుమారు 164 మరుగుదొడ్లు, వాష్రూమ్లలో ఫ్లష్ట్యాంక్లు, సింక్లు పనిచేయక రోగులు, సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బకెట్లతో నీరు మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. సమస్యపై స్పందించిన సూపరింటెండెంట్ అల్లు పద్మజ మరుగుదొడ్లను పరిశీలించి తక్షణమే మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చారు.