బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న హనుమాన్ అంశ్ చిత్రం

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన హనుమాన్ అంశ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.366 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది. కేవలం రూ.2 కోట్ల స్వల్ప నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈ సినిమా, పెట్టిన పెట్టుబడికి వందల రెట్ల లాభాలను తెచ్చిపెడుతూ ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ ప్రాఫిట్ మార్జిన్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.