రూ 1500 కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

రిపోర్టర్: విజయ్ స్థలం: Pithapuram

జనసేన పార్టీ అధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గంలో రూ. 1,500 కోట్లతో పలు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేపట్టారు. తీరప్రాంత రక్షణ గోడ, జల్ జీవన్ మిషన్, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వాటర్ వర్క్స్, రోడ్ల అభివృద్ధి, మత్స్యకారులకు ఆధునిక సౌకర్యాలు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు మరియు తాగునీటి సరఫరా పథకాలతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నారు.