ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం: జీపు బోల్తా పడి ఇద్దరు మృతి
రిపోర్టర్: కిరణ్
స్థలం: Alluri Sitarama Raju
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులోని వంట్లమామిడి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భవాని భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. భక్తులతో వెళ్తున్న జీపు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలిపారు. ఈ దుర్ఘటనలో మరో ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు.