రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు పల్లెర్ల విద్యార్థుల ఎంపిక

రిపోర్టర్: Raju Reporter స్థలం: ఆత్మకూర్

ఎస్జీఎఫ్ఐ ఉమ్మడి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన హ్యాండ్బాల్ ఎంపిక పోటీల్లో ఆత్మకూర్ మండలం పల్లెర్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. తండా రాజేష్, ప్రణతి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను ప్రధానోపాధ్యాయులు జి. వెంకటనరసయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు డాక్టర్ జెట్ట రవీందర్ అభినందించారు. రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.