వైద్య విద్యార్థులకు కీలక అలర్ట్: స్పెషల్ స్ట్రే రౌండ్ కోసం పెరిగిన ఎంబీబీఎస్ ఖాళీలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: చెన్నై
వైద్య కౌన్సిలింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక స్ట్రే రౌండ్ కోసం ఎంబీబీఎస్ ఖాళీల సంఖ్య 946కు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది కంటే అదనంగా పెరిగిన ఈ సీట్లలో అత్యధికంగా తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. కేటాయించిన సీట్లలో విద్యార్థులు చేరకపోవడంతోనే ఈ ఖాళీలు ఏర్పడినట్లు వారు తెలిపారు.