బసివరెడ్డిపల్లి పాఠశాల పైకప్పు కూలినా పెను ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్న గ్రామం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: శ్రీరంగరాజపురం

శ్రీరంగరాజపురం మండలం బసివరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాల భవనం కప్పు ప్రమాదవశాత్తు కింద పడింది. పాఠశాలలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ తక్షణమే నూతన భవనం నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.