ఎల్లంపేట మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల గుట్టురట్టు: కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరిక

రిపోర్టర్: గోపి స్థలం: మేడ్చల్

ఎల్లంపేట మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు, అధికారుల అలసత్వంపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పేదల ఇళ్ల నిర్మాణ అనుమతుల్ లో తీవ్ర జాప్యం జరుగుతుండగా, అక్రమ కట్టడాలకు మాత్రం అంతులేకుండా పోతోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజాధనానికి గండి కొట్టే వారిని, నిబంధనలు ఉల్లంఘించే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన తేల్చిచెప్పారు.