పెదబయలులో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పుష్పాలమ్మ నామినేషన్

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: పెదబయలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం పెద్దకోడపల్లి గ్రామపంచాయతీ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి పాంగి పుష్పాలమ్మ రేపు ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని శ్రేణులు విజ్ఞప్తి చేశాయి.