నేరాలకు సినిమాలను బలిపశువును చేయొద్దు: దర్శకుడు సందీప్ రెడ్డి వంగ

రిపోర్టర్: అశోక్ స్థలం: రాప్తాడు

సమాజంలో జరిగే దారుణ నేరాలకు సినిమాలను కారణం చూపిస్తూ బలిపశువును చేయడం తగదని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్పష్టం చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని రాప్తాడులో బాలికపై జరిగిన దారుణ దాడి ఘటనను ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. విషాద సమయాల్ లో బాధితులపై సానుభూతి చూపించాల్సిందిపోయి, కొందరు అవకాశవాదంతో ఇండస్ట్రీని విమర్శించడం సరికాదని ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.