పస్నూర్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నాంపల్లి
నాంపల్లి మండలం పస్నూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వీరమల్ల శైలజ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మితో పాటు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థుల సౌకర్యార్థం ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి స్వయంగా కుర్చీలను విరాళంగా అందించారు. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని గ్రామస్తులు, తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.