కేరళలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై రాళ్ల దాడికి దిగిన దుండగులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Thiruvananthapuram

కేరళలోని తిరువనంతపురంలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దుండగులు రాళ్లు, సీసాలతో దాడికి పాల్పడ్డారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పీకే కృష్ణదాస్ వాహనంపై కూడా కొందరు దాడి చేశారని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ అరాచకాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రతిఘటించనున్నట్లు ఆ పార్టీ స్పష్టం చేసింది. రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని నాయకులు మండిపడ్డారు.