రేవంత్ సిరిసిల్ల పర్యటనపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం: సీఎంపై విమర్శలు

రిపోర్టర్: రాము స్థలం: Siricilla

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, గోడలకు సున్నాలేసే వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెడితే ప్రజలకే సున్నం పెట్టారంటూ మాజీ ఎమ్మెల్యే గడారి కిషోర్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ పర్యటన ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.