మైనర్ బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి రిమాండ్
మంచిర్యాల జిల్లా
బెల్లంపల్లి పట్టణం లోని శాంతిఖని ప్రాంతంలో మూడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 5న సాయంత్రం 7.30 గంటల సమయంలో బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా, సమీపంలో నివాసముండే కాంపెల కిష్టయ్య బాలికను తన ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అక్కడ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు పిర్యాదు చేశారు.
బాధిత బాలిక భయంతో ఏడుస్తూ ఇంటికి తిరిగి రావడంతో తల్లి విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెల్లంపల్లి రెండో టౌన్ ఎస్ఐ సీహెచ్ తిరుపతి కేసు నమోదు చేశారు. బెల్లంపల్లి రూరల్ సీఐ సీహెచ్ హనోక్ దర్యాప్తు చేపట్టి ఆదివారం మధ్యాహ్నం నిందితుడు కాంపెల కిష్టయ్యను అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.