హాస్టల్ విద్యార్థులకు తీపి కబురు: డైట్ ఛార్జీలు భారీగా పెంపు
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల పోషకాహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని డైట్ ఛార్జీలను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు విద్యా మరియు సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఈ పెరిగిన ఛార్జీలు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు సమగ్రమైన కొత్త మెనూను సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.