పెళ్లికి సిద్ధమవుతున్న యువకుడిని అత్యంత దారుణంగా హతమార్చిన మాజీ సహోద్యోగి
రిపోర్టర్: రాజేష్
స్థలం: గురుగ్రామ్
మరో నెల రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా ఢిల్లీకి చెందిన యువరాజ్ సింగ్ మంచందా హత్యకు గురవడం సంచలనం సృష్టించింది. గురుగ్రామ్‌లో మాజీ సహోద్యోగి అన్య వత్స్, ఆమె భర్త సంయం సచ్‌దేవా ఆర్థిక వివాదాల నేపథ్యంలో యువరాజ్‌ను తుపాకీతో కాల్చి చంపి మృతదేహాన్ని కాలువలో పడేశారు. నిందితులు చాకచక్యంగా వాట్సాప్ ద్వారా కుటుంబ సభ్యులకు తప్పుడు సందేశాలు పంపగా, అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.