గన్నవరంలో మెగా రైల్ టెర్మినల్ ఏర్పాటుకు రూ.907 కోట్లు అంచనా

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఎన్టీఆర్ జిల్లా

విజయవాడ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు గన్నవరం, అమరావతుల్లో మెగా రైల్ టెర్మినళ్ల నిర్మాణానికి రైల్వే అధికారులు డీపీఆర్‌ సిద్ధం చేశారు. గన్నవరంలో 10 ప్లాట్‌ఫామ్‌లతో టెర్మినల్ నిర్మాణానికి రూ.907 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. విజయవాడ ప్రధాన స్టేషన్‌లో మూడు లైన్ల విస్తరణ చేపట్టనున్నారు. గన్నవరం కోసం 143 ఎకరాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.