కేజీబీవీ విద్యార్థినులకు బంకర్‌ బెడ్లు అందించేందుకు టెండర్ల ప్రక్రియ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అమరావతి

రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదివే విద్యార్థినులకు బంకర్‌ బెడ్లు అందించేందుకు సమగ్ర శిక్షా విభాగం టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఒక్కో బెడ్‌ గరిష్ఠ ధర రూ.19,500గా నిర్ణయించగా ఫిబ్రవరిలోపు మొత్తం 59,800 బంకర్‌ బెడ్లను సమకూర్చనున్నారు. ఈ బెడ్ల ద్వారా లక్షకుపైగా బాలికలకు వసతి సౌకర్యం కలగనుంది.