సమాచార హక్ కు చట్టం దుర్వినియోగం: యువకుడికి రాష్ట్ర సమాచార కమిషన్ తీవ్ర హెచ్చరిక

రిపోర్టర్: నరేష్ స్థలం: చెన్నై

మాజీ ప్రేయసి ఫొటోలు, వివరాల కోసం ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేసిన యువకుడిని తమిళనాడు రాష్ట్ర సమాచార కమిషన్ తీవ్రంగా హెచ్చరించింది. విల్లుపురానికి చెందిన ఏ.సంతోశ్ అనే యువకుడు మాజీ ప్రేయసిపై వ్యక్తిగత కక్షతో పోలీసులకు వరుస దరఖాస్తులు సమర్పించాడని రాష్ట్ర సమాచార కమిషనర్ వీపీఆర్ ఇలంబరితి వెల్లడించారు. ఇలాగే చట్టాన్ని దుర్వినియోగం చేస్తే మానసిక చికిత్స చేయించాల్సి వస్తుందని ఆయన ఘాటుగా హెచ్చరించారు.