'ఆసియా క్రీడలు చాలా కఠినం': బాక్సర్ విజయేందర్ సింగ్ హెచ్చరిక

రిపోర్టర్: శివ స్థలం: న్యూఢిల్లీ

కామన్వెల్త్ క్రీడల కంటే ఆసియా క్రీడల్లో భారత బాక్సర్లకు అసలు సిసలైన పరీక్ష ఎదురుకానుందని మాజీ ఒంపిక్ పతక విజేత విజయేందర్ సింగ్ స్పష్టం చేశారు. చైనా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల నుంచి గట్టి పోటీ ఉంటుందని పేర్కొంటూ, మహిళా బాక్సర్లు సాక్షి చౌదరి, ప్రీతి పవార్, ప్రియా ఘంగాస్‌లతో పాటు పురుషుల విభాగంలో సచిన్ సివాచ్, నరేందర్ బెర్వాల్ భారత్‌కు పతకాలు సాధించిపెట్టగలరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.