మాదిగలను మోసం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌పై వంగపల్లి శ్రీనివాస్ ధ్వజం
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
మాదిగలను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఎస్సీ డిక్లరేషన్ అంటూ ఎన్నికల ముందు కల్లబొల్లి హామీలు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పూర్తిగా మరచిపోయారని విమర్శించారు. అంబేద్కర్ అభయహస్తం కింద పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదని ఆరోపించారు. విద్యానగర్‌లోని కార్యలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.