ఎస్జీటీ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి ప్రభుత్వం న్యాయం చేయాలన్న భరత్ బాబు

రిపోర్టర్: BHARADWAJ స్థలం: మునగాల

సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో రెండు వేల రెండు డీఎస్సీ ఎస్జీటీ ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్ బాబు ఇరవై నాలుగు సంవత్సరాల సేవలను పూర్తి చేసుకొని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా విద్యారంగ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పునరుద్ఘాటించారు. ఎస్జీటీ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేస్తూ తన అభిప్రాయాలను స్పష్టం చేశారు.