ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న బీఆర్ఎస్ నేత కేటీఆర్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ స్వామిని మనసారా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.