యలహంక భూమి షర్మిలదేనంటూ విజయమ్మ నాటి ప్రకటన వైరల్

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

బెంగళూరులోని యలహంక భూమి తన కుమార్తె షర్మిలదేనని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ స్పష్టం చేశారు. మార్చి 20వ తేదీన ఆమె నోటరీ ద్వారా విడుదల చేసిన బహిరంగ ప్రకటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఎంవోయూలో లేని యలహంక ఆస్తితో పాటు సరస్వతి సిమెంట్ కూడా షర్మిలదేనని, ఆస్తుల పంపకంలో జగన్మోహన్రెడ్డి అన్యాయం చేశారని విజయమ్మ ఆరోపించినట్లు ఈ ప్రకటనలో వెల్లడైంది.