కలువాయిలో పిచ్చి కుక్క బీభత్సం: పదిహేను మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వైనం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కలువాయి
కలువాయి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఓ పిచ్చి కుక్క స్వైరవిహారం చేసి పదిహేను మందిపై దాడి చేసి గాయపరిచింది. రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. బాధితులు కలువాయి, పొదలకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందారు. పిచ్చి కుక్క బెడదను నివారించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.